'బిజినెస్ మ్యాన్'కథ ఆ ప్రెంచి చిత్రం కాపీనా?


 
మహేష్ తాజా చిత్రం 'బిజినెస్ మ్యాన్'ఈ నెల 13 న అత్యధిక ప్రింట్లతో విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. మరో ప్రక్క ఇక ఈ చిత్రం కథ Largo Winch (2008) అనే ప్రెంచి చిత్రం ఆధారంగా రూపొందింది అంటూ ఫిల్మ్ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది. హాలీవుడ్ చిత్రం కథ ప్రకారం హీరో పెద్ద మిలియనీరు. అతని పెంపుడు తండ్రి అనుమానస్పద పరిస్దితుల్లో చనిపోతే. ఆ వ్యాపార సామ్రాజ్యం చూసుకోవటానికి వస్తాడు. ఈ నేపధ్యంలో కుట్రలు,ఎత్తులు..పై ఎత్తులతో కథ జరుగుతుంది.తన తండ్రిని చంపిన వారిపై పగ తీర్చుకునే క్రమంలో అతను ఎదుర్కొనే సవాళ్లు...ఈ చిత్రాన్ని ఆసక్తి కరంగా నడిపిస్తాయి. మంచి ధ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం అక్కడ మంచి విజయాన్నే సాధించింది.

అంతేగాక దీనికి సీక్వెల్ సైతం వచ్చింది. అక్కడ కామిక్స్ ఆధారంగా ఈ కథను తెరకెక్కించటం జరిగింది. ఇక బిజినెస్ మ్యాన్ చిత్రం కథ ఇదా కాదా అన్నది తేలాలంటే విడుదల దాకా వేచి ఉండాల్సిందే. ఇక 'బిజినెస్ మ్యాన్' చిత్రం ముంబై మాఫియా నేపధ్యంలో జరుగుతుంది. కాజల్ హీరోయిన్ గా చేసిన ఈ చిత్రం స్టైలిష్ ఎంటర్టైనర్ అని దర్శకుడు పూరీ జగన్నాధ్ చెప్తున్నారు. దూకుడు ఊపు మీద ఉన్న మహేష్ ఈ చిత్రంతో మరో సూపర్ హిట్టు కొడతాడని అభిమానులు వెయిట్ చేస్తున్నారు. ఆర్.ఆర్ మూవీ మేకర్స్ పతాకంపై ఈ చిత్రాన్ని వెంకట్ నిర్మిస్తున్నారు. పోకిరి కాంబినేషన్ కావటంతో డిస్ట్రిబ్యూటర్స్,ఎగ్జిబిటర్స్ సైతం అమితమైన ఆసక్తిని చూపిస్తున్నారు.

0 comments:

Post a Comment

 
Top