ఈ-ఆధార్..గుర్తింపు, చిరునామా ధ్రువపత్రంగా ఉపయోగించుకోవచ్చు. ‘డిజిటల్ సిగ్నేచర్ ఉండే ఎలక్ట్రానిక్ రికార్డులకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం-2000 చట్టబద్ధత కల్పిస్తోంది. కాబట్టి ఈ-ఆధార్ కూడా చట్టబద్ధంగా చెల్లుబాటయ్యే పత్రమే. దానిపైనా డిజిటల్ సిగ్నేచర్ ఉంటుంది’ అని పేర్కొంది. పోస్టులో వచ్చే ఆధార్ పత్రంలో ఉన్న వివరాలే ఈ-ఆధార్‌లోనూ ఉంటాయని పేర్కొంది. పౌరులు యూఐడీఏఐ వెబ్‌సైట్ నుంచి ఈ-ఆధార్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశామని వివరించింది. పోస్టులో ఇంటికొచ్చే ఆధార్ లెటర్ నుంచి కత్తిరించి విడిగా తీయడానికి వీలున్న భాగాన్ని కొందరు గుర్తింపు పత్రంగా అంగీకరించడం లేదంటూ తమకు ఫిర్యాదులు వస్తున్నాయని యూఐడీఏఐ తెలిపింది. అయితే అందులో ఫొటోతో పాటు పేరు, చిరునామా, ఆధార్ నంబర్ అన్నీ ఉంటాయని, కాబట్టి అది చట్టబద్ధంగా చెల్లుబాటయ్యే పత్రమని స్పష్టంచేసింది.
Tags: Telugu News, Andhra News, News
0 comments:
Post a Comment