స్థానిక ఎన్నికల తర్వాత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లుపై అసెంబ్లీలో తీర్మానం చేయనున్నట్లు కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్ చెప్పారు. అసెంబ్లీలో తీర్మానం పెడితే వీగిపోవడం ఖాయమన్నారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతతూ దీనికి సంబంధించి తీర్మానం వీగిపోయేలా ప్రయత్నిస్తామన్నారు. అందరు కలిసి తెలుగుతల్లిని బలిపిఠం ఎక్కించారని ఆయన వాపోయారు. టీడీపీ ఇచ్చిన లేఖతోనే కేంద్రంపై ఒత్తిడి పెరిగిందన్నారు.
 టిడిపి నేతలు తెలంగాణకు అనుకూలంగా ఉన్నందువల్ల, ఆ పార్టీ విభజనకు అనుకూలంగా లేఖను ఇచ్చినందువల్లనే కేంద్రం తెలంగాణ వైపు మొగ్గుతుందని లగడపాటి ఆరోపించారు. కేంద్రం తెలుగు తల్లిని చీల్చుతుందా? లేక అలాగే ఉంచుతుందా? అని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారన్నారు.
కాంగ్రెసు పార్టీ ఎంపీలు, నేతల్లో చాలామంది విభజనను వ్యతిరేకిస్తున్నారన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ విభజన భారాన్ని కేంద్రంపై వేసిందన్నారు. తెలంగాణ సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
శ్రమిస్తున్నాయని  లగడపాటి చెప్పారు. ఈ సమస్య పరిష్కారంపై అందరు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారన్నారు. ఈ మూడేళ్లలో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయన్నారు. అసెంబ్లీలో తీర్మానం ప్రవేశ పెట్టాలని గతంలోనే చెప్పామని కానీ, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు మాత్రం వద్దన్నారని గుర్తు చేశారు. అసెంబ్లీలో తెలంగాణపై తీర్మానం పెట్టినా వీగిపోవడం ఖాయమన్నారు.

Tags: Telugu News, Andhra News, News

0 comments:

Post a Comment

 
Top