చిత్రం : ఇద్దరుఅమ్మాయిలతో
రేటింగ్ : 2. 5 / 5
నటీ నటులు : అల్లు అర్జున్ , అమలాపాల్ , కేధరిన్ తెరిస్సా , బ్రంహానందం , నాజర్, షావర్ అలీ , సుబ్బరాజు , శ్రీనివాస రెడ్డి తదితరులు.
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
కెమెరా : అమోల్ రాథోడ్
ఎడిటింగ్ : ఎస్ . ర్ . శేఖర్
ప్రొడ్యూసర్ : బండ్ల గణేష్
రచన - దర్సకత్వం : పూరి జగన్నాథ్
అల్లు అర్జున్ , పూరిజనాథ్ కాంబినేషన్ లో తయారైన 'ఇద్దరుఅమ్మాయిలతో' చిత్రం విడుదల విషయం లో కొంత జాప్యం జరిగినా ఎట్టకేలకు (31 May 2013) శుక్రవారం విడుదలై భారీ ఓపినింగ్స్ అందుకుంది.
స్టోరీ : విదేశాలలో క్లాసికల్ సంగీతం నేర్చుకుంటున్న కోమలి ( అమలపాల్ ) రాక్ స్టార్ సంజు (అల్లు అర్జున్ ) ఒకరి నొకరు ప్రేమించుకుంటారు. వీరి ప్రేమను ఓ డైరీ ద్వారా తెలుసుకున్నఆకాంక్ష (కేధరిన్) వారి ప్రేమను గురించి తెలుసుకునే ప్రయతంలో తనను ఆశ్చర్యం గొలిపే విషయాలను తెలుసుకుంటుంది. ఆ తరువాత సంజు ప్రేమలో పడ్డ ఆకాంక్ష అతని జీవితంలో ప్రవేశిస్తుంది. ఆ తరువాత ఏం జరిగింది అనేది సినిమా .
పెర్ఫామెన్స్ :
అల్లు అర్జున్ నటన , డాన్స్ ఆకట్టుకుంటాయి. తను డాన్స్ కోసం యెంత కష్ట పడతాడో తెలుస్తుంది. ఇందులో హీరోయిన్ గా నటించిన అమలపాల్ పోటిపడి నటించినట్లు అనిపిస్తుంది . కేథరిన్ కేవలం గ్లామర్ గరళ్ గా మిగిలింది.
బండ్ల గణేష్ నిర్మాత గా బాగా డబ్బు కర్చు పెట్టారు. కస్తుమ్స్ , కెమెరా పనితనం బాగున్నయి. కొన్ని సీన్స్ బాగున్నా , మంచి కధ లేకపోవటం లోటనిపిస్తుంది . ప్రేమ సన్ని వేశాలు ఎన్ని సినిమాలల్లో చూసినా కొత్తగానే వుంటుంది . కధనం మంచిగున్నా కధ లేకపోతే ప్రేక్షకుల్ని నిరసపరుస్తుంది . ఈ సారి ఎందుకో పూరి సినిమా లో కామిడి పూర్తిగా ఫెయిల్ అయింది . బ్ర్మహానందం కామిడి చాలా రొటీన్ గా ఉంది . పాటలు , బన్ని డాన్స్ బాగున్నా ప్రేక్షకులు యెంత వరకు ఆదరిస్తారో చూడాలి .
Tags: Iddarammailatho movie review, cinema review Allu Arjun, Iddarammailatho,
0 comments:
Post a Comment