పవన్ స్టార్ అభిమానులకు సారీ చెప్పిన పూరి !
అల్లు అర్జున్ హీరొగా నటించిన ఇద్దరమ్మాలతో విడుదలైన విషయం అందరికి తెలిసిందే . ఈచిత్రానికి దర్శకుడు పూరి జగన్నాద్ , అందులో సరదాకోసం ఓ డైలాగ్ పెట్టాడు. అదేమిటంటే 'ప్రపంచంలో ప్రతి ఎదవ పవన్ ఫ్యానే '
ఇదివెళ్లి పవన్ ఫాన్స్ గుండెలకు తగిలింది . అంతే నీకంటికి వెధవల్లా కనిపిస్తున్నామా అంటూ రగిలి పోయి భారీగా నిరసనలు తెలియచేసారు . దీనితో పూరి సమాదానం చెప్పుకో వలసి వచ్చింది . యవరినీ కించపరచాలని ఉద్దేశం నాకు లేదు . సరదాకోసం నేనా డైలాగ్ రాసాను . మిమ్మలిని భాధపెట్టుంటే అందరికి సారీ చెపుతున్నాను అన్నాడు. మరి ఫాన్స్ సినిమా లో ఆ డైలాగ్ తొలగించాలన్న డిమాండ్ వెన్నక్కి తీసుకుంటారో లేదో చూడాలి .
Tags: Allu arjun iddrammailatho, Poori jagannadh, Pava kalyan Fance
0 comments:
Post a Comment