ఉత్తరాఖండ్‌లో ప్రకృతి ఇప్పుడిప్పుడే శాంతిస్తోంది. బద్రీనాథ్, హార్సిలీ ప్రాంతాల్లో ఇంకా 3 వేల మంది బాధితులు సాయం కోసం ఎదురు చూస్తున్నారు. వాతావరణం అనుకూలించగానే వీరిని తరలించేందుకు 17 హెలికాప్టర్లను సిద్ధం చేశారు. మరోవైపు 3 వేల మంది అభాగ్యుల ఆచూకీ ఇప్పటికీ తెలియడం లేదు. వీళ్ళంతా ఎక్కడున్నారు. ఎలా ఉన్నారన్న దానిపై సర్వత్రా ఆందోళన నెలకొంది. 14వందల మంది మాత్రమే చిక్కుకుపోయారని అధికారులు చెబుతున్నా వాస్తవానికి వాళ్ళ సంఖ్య 5 వేల వరకు ఉంటుందని భావిస్తున్నారు.
అటు కేదార్‌నాథ్‌లో సామూహిక అంత్యక్రియలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 50కి పైగా మృతదేహాలకు అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు. పలు మృతదేహాలు కుళ్లిపోతున్నాయి. గుర్తించిన శవాలకు అంత్యక్రియలు చేస్తున్నా... మట్టి దిబ్బల్లో మృతదేహాలు కూరుకుపోయాయి. పరిసర ప్రాంతాల్లో దుర్గంధం వ్యాపిస్తుండడంతో అంటువ్యాధులు ప్రబలకుండా చూసేందుకు సైనిక సిబ్బంది రసాయనాలు చల్లుతున్నారు. రహదారుల పునరుద్ధరణ ప్రక్రియ కూడా ఊపందుకుంది. జోషిమఠ్-బద్రీనాథ్, రుద్రప్రయాగ-గౌరీకుండ్, ఉత్తరకాశీ-గంగోత్రి మార్గాలు మినహా మిగతా రోడ్లను తెరిచారు.

0 comments:
Post a Comment