జలప్రళయానికి చిధ్రమైన కేదారినాథ్ లో మరో వివాదం మొదలైంది. ఆలయంలో పూజల పునరుద్ధరణపై  పూజారులు, సాధువుల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. వరద విలయానికి మహా శ్మశనవాటికలా మారిన ఆలయాన్ని పూర్తిగా శుద్ది చేయకుండా పూజలు ప్రారంభించబోమని పూజారులు చెబుతున్నారు. అయితే సాధువులు మాత్రం పూజారుల వాదనను కొట్టిపారేస్తున్నారు. ఆలయాన్ని శుభ్రపరిచిన వెంటనే పూజలు చేస్తామని పట్టుబడుతున్నారు. దీంతో కేదారినాథ్ లో పూజా వివాదం ముదురుతోంది.

సాధువుల వాదనను శంకరాచార్య స్వరూపానంద సమర్ధించడాన్ని ప్రధాన పూజారులు వ్యతిరేకిస్తున్నారు. కేదారినాథ్ ప్రాంతాన్ని పూర్తిగా శుద్ధిచేయకుండా పూజలు ప్రారంభిస్తే తాము కోర్టుకు వెళతామని హెచ్చరిస్తున్నారు. అవసరమైతే ప్రధానిని కలిసి అడ్డుకోవాలని కోరతామంటున్నారు. మరోవైపు ప్రధాన పూజారి పాలకవర్గ కమిటీకి సేవకుడిలా మారారని సాధువులు,పీఠాధిపతులు మండిపడుతున్నారు. 

Tags: Telugu News, Andhra News, News

0 comments:

Post a Comment

 
Top