గోపిచంద్ కొత్త సినిమా 'సాహసం ' జూన్ 21న విడుదల !



రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీచిత్ర ఇండియా ప్రై. లిమిటెడ్‌ పతాకంపై భారీ చిత్రాల 'ఛత్రపతి' ప్రసాద్‌ నిర్మిస్తున్న చిత్రం 'సాహసం'. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని జూన్‌ 21న వరల్డ్‌వైడ్‌గా ఈ చిత్రం విడుదల కానుంది. 

ఈ సందర్భంగా నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ మాట్లాడుతూ - ''గోపీచంద్‌, చంద్రశేఖర్‌ ఏలేటి కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన 'సాహసం' చిత్రాన్ని ఈనెల 21న వరల్డ్‌వైడ్‌గా విడుదల చేస్తున్నాం. ఈ చిత్రం ఆడియో ఆల్రెడీ సూపర్‌ హిట్‌ అయింది. శ్రీ చాలా ఎక్స్‌లెంట్‌ మ్యూజిక్‌ ఇచ్చారు. రీ-రికార్డింగ్‌కి ఎంతో ప్రాధాన్యత వున్న ఈ చిత్రానికి శ్రీ అద్భుతంగా ఆర్‌.ఆర్‌. చేశారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. గోపీచంద్‌, చంద్రశేఖర్‌ ఏలేటి కాంబినేషన్‌లో మా బేనర్‌లో వస్తోన్న ఎడ్వంచరస్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. రెగ్యులర్‌ సినిమాలకు భిన్నంగా చంద్రశేఖర్‌ యేలేటి స్టైల్‌లో వుంటూనే అన్ని కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ వున్న సినిమా ఇది. గోపీచంద్‌కి డెఫినెట్‌గా ఇది సూపర్‌హిట్‌ సినిమా అవుతుంది. అలాగే మా బేనర్‌లో మరో మంచి సినిమా అవుతుంది'' అన్నారు. 




గోపీచంద్‌, తాప్సీ, శక్తికపూర్‌, ఆలీతో పాటు ప్రముఖ తారాగణం ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫి: శ్యామ్‌దత్‌ ఎస్‌., ఆర్ట్‌ డైరెక్టర్‌: ఎస్‌. రామకృష్ణ, సంగీతం: శ్రీ, ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు, ఫైట్స్‌: సెల్వ, అసోసియేట్‌ రైటర్స్‌: కె.కె.రాధాకృష్ణకుమార్‌, ప్రశాంత్‌, సుమలత, మాటలు: కె.కె. రాధాకృష్ణకుమార్‌, పాటలు: అనంత్‌ శ్రీరాం, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: సుధీర్‌, కో-ప్రొడ్యూసర్‌: భోగవల్లి బాపినీడు, నిర్మాత: బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: చంద్రశేఖర్‌ ఏలేటి.



Tags: Movie News, Cinems News, Telugu Movies, Telugu Cinema

0 comments:

Post a Comment

 
Top