బాలీవుడ్ నటి జియాఖాన్ రేప్ కు గురైందా ?
బాలీవుడ్ నటి జియాఖాన్ ఆత్మహత్య కేసు అనేక మలుపులు తిరుగుతోంది . తనకు సరి అయిన గుర్తింపు రాక , సరి అయిన అవకాశాలు లేక మానసికంగా డిప్రెషన్ కి లోనై తను ఆత్మ హత్య కు పాల్పడిందని తొలుత అందరు భావించారు . పోలీసులు వెల్లడించిన సమాచారం ప్రకారం... నటి జియా ఖాన్‌పై సూరజ్ పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. తనను బలవంతంగా లొంగదీసుకుని బలవంతంగా రేప్‌కు పాల్పడి తను గర్భవతిని చేశాడని జియా ఖాన్ సూసైడ్ నోట్ లో పేర్కొన్నట్లు సమాచారం.
జియా ప్రెగ్నెంట్ అని తెలుసుకున్న వెంటనే సూరజ్ అబార్షన్ చెయించుకోమని ఒత్తిడి తెచ్చి, అబార్షన్ చేయించుకునేంతవరకూ ఆమెకు నరకం చూపించినట్లు తెలుస్తోంది. ఒకవైపు తనను అనుభవించేసి ఇంకా అనేకమంది అమ్మాయిలతో శారీరక సంబంధాలు పెట్టుకున్నాడనీ, దాంతో తను మానసికంగా కుంగిపోయినట్లు జియా ఖాన్ లేఖలో పేర్కొన్నట్లు పోలీసులు చెప్పినదాన్ని బట్టి తెలుస్తోంది. అబార్షన్ కోసం జియా ఖాన్‌ను సూరజ్ చిత్రహింసల పాల్జేసినట్లు తెలుస్తోంది.
Tags: Movie News, Cinema News, Telugu Movie News, Telugu Cinema News
0 comments:
Post a Comment