సిక్స్ పాక్ లో కనిపించనున్న నాగబాబు !

నాగబాబు తన తనయుడు వరుణ్ ని పరిచయం చేయబోయే తొలిచిత్రం లో తనుకూడా ఓ పాత్ర లో నటించనున్నట్లు  తెలిసింది . అందులో ఓ సన్నివేశం లో సిక్స్ పాక్ లో కని పించాల్సి ఉంది . వరుణ్ కూడా తన తండ్రిని సిక్స్ పాక్ లో
కనిపించాలని కోరటంతో, నాగబాబు అందుకు సరే అన్నట్లు తెలిసింది . ఇంత లేటు వయసులో  ఇదేం ఆలోచన అని అప్పుడే చెవులు కొరుక్కోవడం మొదలుపెట్టారు . సూపర్ హిట్  సినిమా 'నరసింహ '  లో రజనీ ఓ ఫైట్ లో తన కండలు  చూపించి అందరిని ఆకట్టు కున్నారు .  రజనీకి అప్పటికి లేటు వయసే . ఆ ప్రతిభ చూపించే  దర్శకుడి లో ఉండాలి . నిన్న కాక మొన్న మన 'సునీల్ 'సిక్స్ పాక్ లో ఆదరగోట్టేసాడు . సో మంచి దేహ ధారుడయ్యమ్ ఉన్న నాగబాబు   ఈ అవకాశం వినియోగించుకుని తన పాత్రను బాగా చేయాలని ఆశిద్దాం .

Tags : Telugu Cinema, Telugu Movies, Movies, Movie News, Cinema News, Naga Babu

0 comments:

Post a Comment

 
Top